Monday, April 20, 2015

Vinayaka vratham వినాయక వ్రతకల్పం

పూజ సామాగ్రి 

పసుపు, కుంకుమ,తమలపాకులు,గంధం,వక్కలు,కర్పూరం,అగరవత్తులు,అక్షింతలు,దీపం,వస్తాములు  ప్రత్తితో చేయవచ్చు ,కొబ్బరికాయలు ,పంచామృతం (ఆవు పాలు,నెయ్యి,పెరుగు,తేనే,చక్కర ),కలశము ,వినాయకుని ప్రతిమ లేక విగ్రహము, పండ్లు ,వివిధ రకముల పువ్వులు ,యజ్ఞోపవీతం  ప్రత్తితో  చేయవచ్చు.

గణపతి పూజ విధానం 

ఇంటి ఈశాన్యములో స్తలమును శుద్దిచేసి , బియ్యపు పిండితో ముగ్గు పెట్టి దైవ స్థాపన కొరకు పీట వేయాలి. పీట మరీ ఎత్తుగా కానీ మట్టంగా కానీ వుండరాదు. పీటకు పసుపు రాసి , కుంకుమతో  బొట్టుపెట్టి , బియ్యపు పిండితో అష్టదళ పద్మం వేయాలి.
ఒక పళ్ళెంలో లేక పీట ఫై  బియ్యం పోసి , దానిపై తమలపాకులో పసుపుతో చేసిన వినాయకుని వుంచాలి
పసుపు గణపతికి  కుంకుమతో బొట్టుపెట్టి  పూజ  ప్రారంబించవలెను.  


    
             


No comments:

Post a Comment